కొన్ని కాయగూరలు -సంస్కృతంలో వాటి పేర్లు
అవాక్పుష్పీ బెండకాయ
ఉర్వారుక: దోస
కర్కటీ నక్కదోస
కారవేల్ల: కాకరకాయ
కోశాతకీ బీరకాయ
జంబీరమ్ నిమ్మకాయ
బృహతీ ముళ్ళవంకాయ
మరిచకా: మిరపకాయలు
రాజకోశతకీ బెంగళూరువంకాయ
లశున: వెల్లుల్లి
వార్తాక: వంకాయ
బింబమ్ దొండ
శీతలా సొరకాయ
సతీనకమ్ అలచందలు
క్షుద్రశింబి: గోరుచిక్కుడు
పలాండు: నీరుల్లి
ఆలుకమ్ బంగాళదుంప
కూష్మాండ: గుమ్మడి
తౄణబిందుక: చేమదుంపలు
మూలకమ్ ముల్లంగి
రంభాశలాటు: పచ్చి అరటికాయ
సూరణ: కంద
తర్వాతి టపాలో కొన్ని ఆకు కూరల పేర్లు…
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
మా అమ్మాయి గొంతులో “నాన్నా అను పదమే”…-ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుక
మా అమ్మాయి గొంతులో “నాన్నా అను పదమే”…-మా అమ్మాయి ఫాదర్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుక
To listen CLICK HERE
//పల్లవి //
నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం
చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..
తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని
తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..
హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై
సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా..
|
“ఒహో యాత్రికుడా!” సాలూరి రాజేశ్వరరావు గారు…స్వరపరిచి ,స్వయంగా పాడిన ప్రైవేటు పాటలలో ఆణిముత్యం..
———————————————————————————————–
|
ఒహో యాత్రికుడా! ఒహో యాత్రికుడా!
ఒహో యాత్రికుడా! ఒహో యాత్రికుడా!
ఉదయారుణ కాంతిపుంజపథనము దెస పయనించు ఒహో యాత్రికుడా! యాత్రికుడా!
ఉదయపూర్ణ మృదులగాన సుధల జల్లి మధుపగాన
కదలిపోవుతున్నావొహో యాత్రికుడా! యాత్రికుడా!
——————————————-
అంధకార దీర్ఘనిశా బంధనమ్ము సడలించుక,
గంధవాహ తురంగ మత్ చందనమ్ము గదలించుక,
సింధుఫార పూర్వ దిశా సుందరతీరమ్ము చేరునో యాత్రికుడా! యాత్రికుడా!
——————————————
శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల,
వదలి కదలి వచ్చితివోహో..యాత్రికుడా.. యాత్రికుడా!
—————————————–
చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ములూగ,
చిత్రచిత్రకలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ,
మిత్రవరా !నేడు నీ పవిత్ర యాత్ర సాగించు..ఒహో యాత్రికుడా! యాత్రికుడా!
ఒహో యాత్రికుడా!
———————————————————————————————–
చత్తీస్ గఢ్ ,బొరాయ్ జవహర్ నవోదయ పాఠశాల లో తెలుగు వెలుగులు..
చత్తీస్ గఢ్ ,బొరాయ్ జవహర్ నవోదయ పాఠశాల లో తెలుగు వెలుగులు..
చత్తీస్ గఢ్ రాష్ట్రం లోని,భిలాయ్ నుండి సుమారు 20 కి.మీ.దూరంలో వున్న కుగ్రామం,బొరాయ్.
ఆ గ్రామంలో వున్న జవహర్ నవోదయ
ఆవో తెలుగు సీఖేన్…అని ఒక తెలుగు పదం,
హిందీలో అర్ధం,..
నిజంగా అక్కడి తెలుగు అధ్యాపకురాలు,కుమారి హేమ గారు ఎంతైనా అభినందనీయురాలు…
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
అరుదుగా కనపడే (వినపడే) సరస్వతీ ప్రార్ధన శ్లోకం… సరస్వతీ పూజ సందర్భంగా బ్లాగ్మిత్రులకి…
అరుదుగా కనపడే (వినపడే) సరస్వతీ ప్రార్ధన శ్లోకం… సరస్వతీ పూజ సందర్భంగా బ్లాగ్మిత్రులకి…
శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీమ్
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహామ్
హస్తేస్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితామ్
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్
–యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం. ‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.
‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.

మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు
ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం 25-October-2009
‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.
అన్నట్టు మా అబ్బాయి పేరు : మాస్టర్ నిధీశ్,
పాత్ర : మీరాజాస్మిన్ కొడుకు,
పాత్ర నిడివి : సినిమా సెకండ్ హాఫ్ నుండి చివరి వరకు,
డైలాగులు :సుమారు ఇరవై,
డబ్బింగ్ : వాడి సొంత వాయిస్
- యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

నిధీశ్

- మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు
- నిధీశ్
- నిధీశ్
- నిధీశ్
- నిధీశ్
వ్యాఖ్యానించండి






































