పెద్దజీయర్ స్వామికి 60 లక్షలు..చిన్న స్వామివారికి 40 లక్షలు..

  • ఇప్పుడే టి.వి.9 లో ఫ్లాష్..
  •     “పెద్దజీయర్ స్వామి వారికి 60 లక్షలు..చిన్నజీయర్ స్వామికి 40 లక్షలు ఏటా గౌరవవేతనంగా ఇస్తామని టి.టి.డి. ప్రకటన..

19 comments so far

  1. శ్రవణ్ on

    ఇంకో వివాదానికి తెరతీయడం కాదు కానీ, T.T.D వెయ్యికాళ్ళమంటపం కూల్చినప్పుడు వీళ్ళు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన విషయం పాఠకులకి గుర్తుండే వుంటుంది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారా? N.T.R గౌరవ వేతనం 1/- కొందరు C.E.Oల గౌరవ వేతనం $1. ఈ లక్షల గౌరవవేతనం ఏంటో? ఇచ్చేవాడ్ని వొదిలేయండి. తీసుకునేవాడికి … వుండఖ్ఖర్లేదా?

  2. chavakiran on

    ఎలాగూ మొదలెట్టారు కదా అని అడుగుతున్నాను..

    మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఈ క్రింది ప్రశ్నలకు కూడా జవాబులు దొరుకుతాయేమో చూడండి.

    1. అసలు వీరికీ తితిదే కి సంబంధమేమిటి?
    2. తితిదే లో వీరేమి చేస్తుంటారు?
    3. జనాలను తితిదే కి ఆకర్షించడంలో వీరి పాత్ర, వీరి శిష్యుల పాత్ర ఏమిటి?

    నాకయితే జవాబులు తెలీదు.

  3. Jamadagni on

    1. Enduku ivva koodadhu.. Evadi abba sommu ani Karunakar Reddy anthaku mundhu Subbirami reddy dochuku thinnaru TTD dabbu ni. ??
    2. Satya Sai baba, Bala Saibaba, Bulli Saibaba, Amma bhagawan, Ayya bhagawan veellandaroo free gaa chesthunnara emainaa? Vaalla ku ichhinappudu veeriki enduku ivvakoodadhu.

    3.Hindu Dharmaaniki Prachaaram avasaramaa? THen what the hell is the difference between Christian missionaries and Hindu Dharma?

    4. Peda vaalla chaduvu arogyaaniki TTD ane oka private organisation money enduku kharchu pettali? Government kharchu pettadaa?

    5. Annamayya vaarasulaku enduku ivvaali? Veellemainaa uddharinchaara? Maa thaathalu nethulu thaagaaru ani cheppukovadam thappa. Jeeyar swami vaaru at least Hindu Dharma uthkrustatha gurinchi chaati chepthunnaru. Aaayana kooda lekapothe ee paatiki Kirasthaani m….. kodukulu Hinduism ni Naasanam chese vaallu. Annamayya vaarasula kante Jeeyar swamy vaare aa dabbu theeskovadaaaniki arhulu.

    Hail Jeeyar Swamigal.

    Agni…

  4. durgeswara on

    mitramaa! niikistE Em chEstaavo cheppu . needhanaanii savyamgaa kharchu pedttagaligite chaalu. vaallakichchedi dharma prachaaraanike. aapani manam cheyagalige rojuna manam maatlaadudaam . paranimda mahaapaapam. mana aalochana maatrame karaktu kaadu ….dhanyavaadamulu

  5. tiyyanitenugu on

    జమదగ్ని మిత్రమా,

    ముందుగా మీ మనసు నొప్పించేవిధంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి..

    ఆ విధంగా అనటం తప్పే..చిన్నస్వామివారికి అని సవరించి తప్పును సరిదిద్దుకున్నాను.

  6. తాడేపల్లి on

    వ్యాఖ్యానించేముందు వార్తల పూర్వాపరాలు క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సి ఉంది. మనం తొందఱపడకూడదు. ముఖ్యంగా TV9 అంత విశ్వసనీయమైన ఛానల్ కాదు గనుక.

  7. వికటకవి on

    నేను తితిదే సొమ్ము ఈ విధంగా వ్యక్తులకు లేదా వారి సంబంధించిన సంస్థలకు ఇవ్వటానికి వ్యతిరేకం. స్వాములు మంచివారయినా, ఆ డబ్బు యొక్క సక్రమ వినియోగం పైన వారు రోజువారీ పర్యవేక్షణ చేయలేరు. అది వారికి తెలిసిన విషయం కాదు. ఇక చివరకు ఆ సొమ్ము చేరేది వారి భృత్యుల పర్యవేక్షణలోకి. ఇదో ముఖ్య కారణం నా వ్యతిరేకతకి. మరొకటి, వీరికే ఎందుకివ్వాలి, మిగతా స్వాములకు ఎందుకివ్వకూడదని వాదనలు మొదలవుతాయి. ఎవరికివ్వాలి ఎవరికి ఇవ్వొద్దు అనటానికి ఎవరు ప్రామాణికం?

    ఇలాంటి చర్యలు తితిదే నిధులు రేప్పొద్దున ప్రభుత్వానికి బదలాయింపు జరగటానికి ముందస్తు చర్యలుగా కూడా ఉపయోగపడవచ్చు. ఈ ఒక్క దానికి ఊరుకుంటే, రేప్పొద్దున అసలుకే ఎసరు పెట్టగల సమర్ధులు ఉన్నారు. అసలు తితిదే నిధులు తితిదే తప్ప అన్యులు ఖర్చు పెట్టకుండా ఉంటేనే ఉత్తమం నా దృష్టిలో, కనీసం కొత్త వివాదాలు ఉండవు.

  8. అబ్రకదబ్ర on

    స్వామీజీలకిచ్చేదాన్ని పక్కనుంచితే, తితిదే కి ఏడాదికి వచ్చే వందల కోట్ల రూపాయల ఆదాయంతో చేసే ఒక మంచి పనేదన్నా ఉందా? ఒకటో రెండో వేద పాఠశాలలు ఉన్నాయి కానీ అవెక్కడో తెలీదు, ఎలా నడుస్తున్నాయో తెలీదు. ఊరూరా కళ్యాణ మంటపాలు కట్టించి వ్యాపారం చెయ్యటం కాకుండా పేదల కోసం బళ్లో, ఆస్పత్రులో కట్టించొచ్చు కదా. ఈ విషయంలో కేథలిక్ మిషనరీస్ చేసిన పాటి సేవ కూడా తితిదే చెయ్యటం లేదు. ధర్మ ప్రచారానికన్నా ముఖ్యమైనది సమాజ సేవ. సమాజంలోని అట్టడుగువారికి దేవుడికన్నా ముఖ్యమైన విషయాలు వేరే ఉంటాయి. తితిదే ధర్మ ప్రచారం పేరిట ఖర్చుల మోత కాస్త తగ్గించి పేదలకుపయోగపడే పనులు చేయటం మంచిది. పైగా, హిందూ ధర్మం కొన్ని సంస్థలో, పార్టీలో కాపాడాల్సినంత బలహీనంగా ఉంటే ముస్లిములు, పాశ్చాత్యుల దాడులకు ఏనాడో కనుమరుగైపోయుండేది. దాన్ని గురించి మరీ అంత కష్టపడి ప్రచారం చేయనవసరం లేదు.

  9. వికటకవి on

    @అబ్రకదబ్ర,

    తితిదే దాదాపు 20000 మంది ఉద్యోగులు గల సంస్థ. తితిదే నిర్వహించే బళ్ళు, ఆసుపత్రులు , కాలేజీలు చాలా ఉన్నాయి. చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. చిట్టా చాలా పెద్దది. హైదరాబాదులోనే ఒక సంస్కృత కళాశాల పూర్తిగా ఉచిత వసతి, భోజనంతో డిగ్రీ వరకు నిర్వహిస్తున్నారు. ఇంకా కీసరగుట్టలో మరొకటి. ప్రభుత్వం కన్నా చక్కగానే నిర్వహిస్తున్నారు, కొన్ని సమస్యలున్నప్పటికీ.

  10. అబ్రకదబ్ర on

    వికటకవిగారూ,

    అందరు ఉద్యోగులున్న తితిదే ఉపయోగపడే పనులు ఏమి చేస్తుందనేది నా ప్రశ్న. ధార్మిక కార్యక్రమాలగురించి నేను అడగటం లేదు. నేను కేథలిక్ మిషనరీస్ తో పోలిక ఎందుకు తెచ్చానంటే, మన దేశంలోని ఏ ప్రముఖ నగరాన్నీ, పట్టణాన్నీ తీసుకున్నా అందులోని పేరున్న కళాశాలలు, ఆసుపత్రులు వీరివే అయి ఉంటాయి. హైదరాబాద్ నే తీసుకుంటే లయోలా అకాడెమీ, సెయింట్ ఆన్స్ కాలేజ్, సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ లాంటివి ఉన్నాయి. ఆ మధ్య ఇండియా టుడే దేశంలోని పది అత్యుత్తమ కళాశాలల పేర్లు ప్రచురిస్తే అందులో మొదటి అయిదూ వీళ్లవే ఉన్నాయి (St Stephens – New Delhi, St Xavier’s – Bombay, St Xavier’s – Calcutta, Loyola – Madras, St Joseph’s – Trichi). దేశానికెందరో ఆణి ముత్యాలనందించాయీ సంస్థలు. పర మతానికి చెందిన సంస్థలు దేశానికీరకంగా సేవ చేస్తుంటే, భారతీయత, హిందూత్వం గురించి ఎప్పుడూ చెప్పే తితిదే వీళ్లతో పోలిస్తే చేస్తున్నదేమిటనేది నా ప్రశ్న. నాకయితే తితిదే కల్యాణమంటపాలే కనిపించాయి ఎక్కడ చూసినా. కనీసం అవన్నా పేదలకు ఉచితంగా వాడుకోటానికిస్తారా?

  11. జియ్యరుస్వామి అవ్వటానికి కోర్సు ఏమైనా ఉంటే శెలవిచ్చి పుణ్యం కట్టుకోగలరు

  12. చక్రవర్తి on

    ఇదేదో బాగుందే.. ఏటా కష్ట పడ్డా నాలుగు లక్షలు రావాలంటే.. తలప్రాణం తోకకొస్తోంది.. ఎంచక్కా కాళ్ళు ముడుచుకుని కూర్చుని .. ’మీరు అది పీకండీ.. మీరు ఇది పీకండో.. ’ అని నలుగురికి చెప్పేస్తే పోతుంది కదా..

    అయినా సన్యాసుల కెందుకండీ ఈ జీతాలు.. ఏం .. మూట కట్టుకు పోతారా..

    అందుకే అన్నారు, పరులకు చెప్పడానికే ఉన్నాయి నీతులు అని.

  13. రమేశ్ on

    మీ అభిప్రాయంతోఏకీభవిస్తున్నాను.

  14. Jamadagni on

    Entandi andaroo ilaa maatlaadathaaru. Asalu meelo evarainaa news correct gaa choosaara?? FYI……That money is not being given to them as salary,
    Hindu Dharma Prachaaraniki ivvabaduthunnadi ( Matha prachaaram koraku kooda kaadu)
    Ante vaari ajamaayishilo Hindu dharma pari rakshanaardham cheyya valasina konni karya kramaalu nirdesinchi daanikoraku ivva baduthunna dabbu adi. Ante kaani JEETHAALU kaadu.

    Please listen to the complete version of the news before you guyz get jealous of their so-called SALARIES..

  15. solo on

    జమదగ్ని గారు కొంచెం కీబోర్డుని, వేళ్ళని కాస్త సున్నితంగా వాడితే బావుంటుంది. ఘాటుగా, మొరటుగా ఉన్న మీ పదజాలం చూసి నేను ఈ వ్యాఖ్య వ్రాయాల్సి వస్తోంది.౯౦% ధార్మిక కార్యక్రమాలు మన దేశంలో క్రైస్తవ సంస్థల ద్వారానే సాగుతున్నాయనేది ఎవ్వరూ కాదనలేని నిజం. మనలో ఎంత మంది ఒక అనాథ శరణాలయాన్ని గానీ, కుష్ట రోగ కేంద్రాన్ని గానీ చూసి ఉంటాం? గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు నడుపుతున్న బళ్ళలో చదువుకున్నవారే. వాళ్ళని దూషించడం ఏరు దాటగానే తెప్ప తగలేయడం కాదా! మీకు అంతగా ఒక మంచి పని చేయాలని ఉంటే, ఆ ధనాన్ని ఎలా ఉపయోగపరచవచ్చో స్వామీజీలకు సెలవివ్వండి. అంతే గానీ వ్యర్థ సంభాషణలతో కాలయాపన అనవసరం.

  16. tiyyanitenugu on

    సాల్మన్ గారూ…నమస్కారం..
    మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..
    అప్పటికీ,కొంత ఘాటైన పదజాలాన్ని కత్తిరించిన తర్వాతే జమదగ్ని గారి వ్యాఖ్యను ఆమోదించాను.
    ఆ వ్యాఖ్య మీకు ఇబ్బందికరంగా వుంటే తెలియచేయండి,తొలగిస్తాను.
    జమదగ్ని గారి వ్యాఖ్య మిమ్మల్ని నొప్పించినప్పటికీ మీ ప్రతివ్యాఖ్య మీ హుందాని ప్రతిబింబిస్తోంది.ఈ సందర్భంగా జీసస్ చివరి మాటలు గుర్తొస్తున్నాయి..
    ‘Father, forgive them, for they know not what they do’
    – సత్యనారాయణ శర్మ.

  17. అబ్రకదబ్ర on

    జమదగ్ని గారి మొదటి వ్యాఖ్యని చదవకుండానే నేను నా వ్యాఖ్యలో కేథలిక్ మిషనరీస్ ప్రస్తావన తెచ్చాను. మొదటే అది చదివి ఉన్నట్లయితే నా వ్యాఖ్య మరింత వివరంగా ఉండేదేమో. ఆ పని ఇప్పుడు చేయదలుచుకున్నాను.

    ఇంతకు ముందే నేను చెప్పినట్లు జియ్యర్లు, బాబాలు, భాజపాలు కాపాడవలసినంత బలహీనంగా లేదు హైందవం. శతాబ్దాలపాటు జరిగిన విదేశీ దండయాత్రల చరిత్రనోసారి చూస్తే తెలుస్తుంది ఆ సత్యం. క్రైస్తవం, ఇస్లాం అడుగు పెట్టిన దేశాలన్నిటిలోనూ ఇతర మతాలు రూపుమాసిపోయాయి – ఒక్క మనదేశంలో తప్ప. హిందూత్వ పునాదులంత బలంగా ఉన్నాయిక్కడ. హిందూత్వం గురించి అంతా తెలుసని విర్రవీగేవారికేమి తెలుసు అసలైన హిందూత్వమంటే ఏమిటో? హైందవమో మతం కాదు – అదో జీవన విధానం. మనదేశంలో పల్లెటూరి జనాలని నీదే మతమని అడిగితే వాళ్లు చెప్పేది ‘నా సామి శివుడు’, ‘మా దేవుడు ఆంజనేయుడు’ లేదా ‘మేం కిట్టయ్యని కొలుత్తాం’ అనే కానీ ‘నేను హిందువుని’ అని కాదు. నిజమైన హిందూత్వ పరిరక్షకులు వాళ్లు. ఈ దేశంలో పుట్టిన ఏ మతస్థుడయినా హిందువే. ముక్కోటిదేవతలున్న హిందూత్వం బుద్ధుడు, జీసస్, అల్లాలను కూడా వారిలో ఒకరుగా భావించి తనలో కలిపేసుకోవటంలోనే ఉంది దాని విశిష్టత. నమ్మకపోతే గుంటూరు కాలే మస్తాన్ షా వలియా దర్గా ఉరుసులో కానీ, గుణదల మేరీమాత తిరునాళ్లలో కానీ భక్తిపారవశ్యంతో చిందులుతొక్కే వేలాది హిందువులనడగండి.

  18. Jamadagni on

    Wow.. this is a news for me to know that 80% of the charity work is being done only with the help of the missionaries. Everyone would really appreciate if the missionaries can do that help after stopping conversion. (By stopping the magnificient preaching that the Hindu gods are bad and Christian god is great).
    BTW.. For your all kind information.. i am not a reilgious fanatic… but i cannot just keep quiet when somone talks bad about hinduism.

    Thanks a ton for criticizing the Swamijis…… You are entitled to criticize your own hindu saints and praise the Christians… Wow……

  19. అబ్రకదబ్ర on

    జమదగ్నీ,

    ఏదో ఒక రకమైన లాభం కోసం (ఉచిత చదువు, ఉద్యోగం, మొ.) క్రైస్తవం పుచ్చుకున్నా ఆచరణలో హిందువులుగానే కొనసాగుతున్నవాళ్లు ఎందరో తెలుసు నాకు. అటువంటివారివి బలవంతపు కన్వర్షన్స్ అనుకుంటే అది మీ అమాయకత్వమే. హిందూ సంస్థలు చేసే ఆరోపణలు పేపర్లలో చదివి ఊరికే ఆవేశపడకుండా నిజానిజాలేమిటో తెలుసుకుని మాట్లాడండి. దేశవ్యాప్తంగా ఏటేటా మిషనరీ కాలేజీల్లో చదువుకుని బయటికొస్తున్న లక్షలాదిమంది విద్యార్ధుల్లో ఎందరు క్రైస్తవులుగా మారుతున్నారు? ఏదో ఆశ చూపించింతమాత్రాన మతం మార్చేసుకునే పిచ్చివాళ్లు మీరనుకున్నంత ఎక్కువమంది లేరీ దేశంలో. అలా మారిన వాళ్లకి తితిదేనో మరే హిందూ పధర్మ పరిరక్షణ పీఠాన్నో వేరే ఆశేదన్నా చూపించి మళ్లీ హిందువులుగా మార్చమనండి మరి. ఎవరొద్దన్నారు?

    చర్చ పూర్తిగా పక్కదారి పట్టినట్లుంది. నేనీ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను.


Leave a reply