ఒక చక్కని తెలుగు పాట…
ఈ రోజు రామాచారి గారి లిటిల్ మ్యుజిషియన్స్ ఎకాడమి లో మా అమ్మాయిని చేర్పిద్దామని వెళితే..ఆయన స్వరపరచిన ఒక చక్కటి పాట నేర్పించారు..
ఆ పాట మన బ్లాగ్లోకానికి వినిపిద్దామని…
//పల్లవి //
నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం
మొదటి చరణం
చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..
రెండవ చరణం
తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని
తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..
మూడవచరణం
హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై
సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా..
3 comments so far
Leave a reply
మంచి పాట.లలిత సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న రామాచారి గారు అభినందనీయులు. తెలుగులో సినీగీతాల హోరు పెరిగిన తరువాత, సంగీతమంటే సినిమా పాటే అన్న అపోహ కలిగేట్టుగా తయారయ్యింది.
కన్నడ దేశంలొ ఇప్పటికీ ‘భావ గీతే’ అని లలిత సంగీతం చాలా గౌరవ ప్రదమైన స్థానంలో ఉంది. తెలుగులో కొన్ని ఘంటసాల గారి పాటలు మినహా పాప్యులరైన లలైత గీతాలు తక్కువే.
బహుశా ఎవరూ వినని సమయంలో రేడియో లో, చూసినా (వినినా) భరించలేని విధంగా దూరదర్శన్ వీటిని ప్రసారం చేస్తూ లలిత సంగీతానికి అన్యాయం చేస్తున్నారేగానీ, ప్రజలకు దగ్గర చెయ్యడంలో విఫలమైయ్యారని నా నమ్మకం.
http://www.parnashaala.blogspot.com
Thanks for introducing a nice song. Please do post more, if possible!!
very good song pl inclucate the importance of mother and father to the young generation mor and more.