‘గోరింటాకు’ లో మీరాజాస్మిన్ నటన అద్భుతం..

దర్శకుడు ప్రతాప్ గోరింటాకు చిత్రాన్ని, ఎక్కడా ప్రేక్షకుడిని చిరాకుపెట్టకుండా అద్భుతంగా తీసారు.
 మీరాజాస్మిన్ చక్కగా నటించి అందరి మన్ననలను పొందుతోంది..
      రాజశేఖర్ తన పాత్రలలో చక్కగా యిమిడిపోయారు.

  మీరాజాస్మిన్ కొడుకు పాత్రలో మాస్టర్ నిధీశ్ చక్కగా నటించాడు..
  మొత్తమ్మీద ‘గోరింటాకు’ పరిశ్రమ వర్గాల ప్రకారం హిట్ దిశగా పయనిస్తోంది..

2 comments so far

  1. అబ్రకదబ్ర on

    గుడుంబా శంకర్ లో మీరాజాస్మిన్ నటన చూసి దడుచుకున్నాను. గోరింటాకులో బాగా చేసిందంటే విశేషమే. ఆమధ్యెప్పుడో జాతీయ అవార్డు కూడా వచ్చిందటగా ఆమెకి.

  2. sujata on

    డీడీ లోక్ సభా చానెల్లో మీరా జాస్మిన్, ముమ్మట్టిల సినిమా ఒకటి చూసానండీ.. ఎంత బావుందో చెప్పలేను. ఆ అమ్మాయి లో చాలా టాలేంట్ ఉంది. ఏమి సినిమానో తెలియదు. మళయాళ భాష లో ఉంది. మీరా జాస్మిన్ కి పెళ్ళయి ఒక కొడుకు కలిగాక, మమ్ముట్టి తో ప్రేమలో పడుతుంది. సినిమా నాకు పెద్ద అర్ధం కాలేదు గానీ మీరా జాస్మిన్ అదరగొట్టింది. అమాయకంగా, పిచ్చి పట్టిన ప్రేమికురాలిగా, భార్య గా, తల్లి గా, చిన్న పిల్ల లా బేల గా చాలా బాగా నటించింది. నిజ జీవితం లో క్రిస్టియన్ అయినా లలితా సహస్త్రం బాగా చదువుతుంది ఈ సినిమాలో. సినిమా చూసాకా, మన తెలుగు సినిమాల్లో ఎంత తక్కువ గా ఆమె టలెంట్ ను వాడుకుంటున్నారో అనిపించింది.


Leave a reply