‘Uncategorized’ అనే వర్గంలోని టపాలు

ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం. ‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.

‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.

మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు

మాస్టర్ నిధీశ్,పాత్ర:మీరాజాస్మిన్ కొడుకు

ఈ ఆదివారం జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘గోరింటాకు ‘ చలనచిత్రం 25-October-2009
‘గోరింటాకు ‘ చలనచిత్రం చూసి మా అబ్బాయి నటన ఎలా వుందో బ్లాగ్మిత్రులు చెపితే సంతోషిస్తాను.
అన్నట్టు మా అబ్బాయి పేరు : మాస్టర్ నిధీశ్,
పాత్ర : మీరాజాస్మిన్ కొడుకు,
పాత్ర నిడివి : సినిమా సెకండ్ హాఫ్ నుండి చివరి వరకు,
డైలాగులు :సుమారు ఇరవై,
డబ్బింగ్ : వాడి సొంత వాయిస్
- యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

నిధీశ్

నిధీశ్

నిధీశ్

ఇవండీ మన నెంబర్ ప్లేట్లు… నిద్రపోతున్న ఆర్.టి.ఎ శాఖ….మనకెందుకులే-ట్రాఫిక్ పోలీసులు

DSC03449

సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..

సినిమా హాల్లో జాతీయ గీతం..ఆసాంతం లేచి నిలుచున్న ప్రేక్షకులు..

స్థలం : పంచ్ శీల్ సినిమా, నాగ్ పూర్, మహారాష్ట్ర
తేది: 6, జనవరి , 2009.  3.00 pm
చిత్రం: రబ్ నే బనాదీ జోడి..
  

చిత్రం మొదలవ్వటానికి ముందుగానే లోపలికి వెళ్ళి కూర్చున్నాను..
  ట్రైలర్ నడుస్తోంది. ఇంకొక ట్రైలర్ మొదలయ్యేటట్లనిపించింది.
 

National Anthem అని కనిపించగానే అందరూ ఒక్కసారిగా లేచి నిల్చున్నారు.
 

వెండితెర పై రెపరెపలాడుతున్న త్రివర్ణపతాకం.. వినిపిస్తున్న ‘జన గణ మన” జాతీయగీతం.  క్రింద తరగతి నుండి బాల్కనీ దాకా అందరూ, ఆఖరికి చంటి పిల్లలని ఎత్తుకొని కూడ  శ్రద్ధగా నిలుచున్న తీరు,ఏ మాత్రం కదలకుండా , జాతీయ గీతం పూర్తి అయిన తరువాతే కూర్చోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఇది ఏ సినిమా డైలాగో చెప్పుకోండి చూద్దాం..

ఇది ఏ సినిమా డైలాగో చెప్పుకోండి చూద్దాం..

 ” ఫష్   రావాలంటే   షావల్ గ  నాన్న..”

              హింట్ కావాలా..
ఈ మధ్య విడుదలై చెత్త చెత్తగా ఆడుతున్న సినిమా లోనిది..

గతేడాది నేను పబ్లిష్ చేసిన వినాయకచవితి పేజి…

‘గోరింటాకు’ లో మీరాజాస్మిన్ నటన అద్భుతం..

దర్శకుడు ప్రతాప్ గోరింటాకు చిత్రాన్ని, ఎక్కడా ప్రేక్షకుడిని చిరాకుపెట్టకుండా అద్భుతంగా తీసారు.
 మీరాజాస్మిన్ చక్కగా నటించి అందరి మన్ననలను పొందుతోంది..
      రాజశేఖర్ తన పాత్రలలో చక్కగా యిమిడిపోయారు.

  మీరాజాస్మిన్ కొడుకు పాత్రలో మాస్టర్ నిధీశ్ చక్కగా నటించాడు..
  మొత్తమ్మీద ‘గోరింటాకు’ పరిశ్రమ వర్గాల ప్రకారం హిట్ దిశగా పయనిస్తోంది..

ఒక చక్కని తెలుగు పాట…

ఈ రోజు రామాచారి గారి లిటిల్ మ్యుజిషియన్స్ ఎకాడమి లో మా అమ్మాయిని చేర్పిద్దామని వెళితే..ఆయన స్వరపరచిన ఒక చక్కటి పాట నేర్పించారు..
ఆ పాట మన బ్లాగ్లోకానికి వినిపిద్దామని…

//పల్లవి //

                 నాన్నా అను పదమే.. నాదసుధారసమై
                             నడిపించును జీవితం
                            నవరస భరితం… నవరస భరితం

 

మొదటి చరణం

                 చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
                           తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
                 జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
                           ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..

రెండవ చరణం

                తనయుడె తన జీవమని..  తనకే సర్వస్వమని
                          కనులముందు తన రూపే..  కదలాడుట భాగ్యమని

                తలమునకలు వేయునంత
                        తనకొకింత దూరమైన
                తల్లడిల్లి తపియించే
                        తండ్రికి వేరెవరు సాటి  .. నాన్నా ..

మూడవచరణం   

                హితమై జీవితమై                                                   
                     మహిత మార్గదర్శకమై
                ఉపదేశామృతమై
                     ఉజ్వల భవితవ్యమై

                సఖుడై గురుడై జనకుడె
                     స్వాచార్యదేవుడై
                సతము సుతుని నీడయై
                     చల్లని దీవెనలనిచ్చు..  నాన్నా..

‘సాక్షి’ – నాలుగు కోట్ల ఏళ్ళట .. మరో ఏడు తరాలట ..

 

గ్రహతాకిడితో భూమిపై జీవ వినాశనం

 

   రోజు ’సాక్షి‘ వార్త.. * నాలుగు కోట్ల ఏళ్ల తర్వాత బుధగ్రహం లేదా అంగారకుడు భూమిని 

 ఢీకొంటే మహావినాశనం తప్పదు.

 మనం మన తర్వాత మరో ఏడు తరాలకు ఇబ్బంది లేదన్నది వార్త… 

  తరానికి 25 ఏళ్ల వంతున వేసుకున్నా మన తర్వాత 16 లక్షల తరాల వరకు ఇబ్బంది వుండదు.

 

 

త్వరలోనే ’సాక్షి’ బాలారిష్టాలను అధిగమిస్తుందని ఆశిద్దాం.. ఆశించటంలో తప్పు లేదు కదా

 

                                    - వేంకట సత్యనారాయణ

రామోజీరావు గారూ..ఇదేనా మీ నిశ్’పాక్షికత ‘…

అనుకోకుండా ఒక రోజు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది.ఆ రోజు వుదయాన్నే ఎప్పటినుండో చదవటానికి అలవాటుపడ్డ ఈనాడు దినపత్రిక చేతుల్లోకి తీసుకుని చూస్తే..జిల్లాకు మిగిలింది చిల్లరేఅనే టైటిల్ తో వార్త కనిపించింది.ప్రధాన పేజిలో ఎ’లక్ష’న్ బడ్జెట్ అనే శీర్షికను పెట్టి,,ప్రతి జిల్లావార్తలలో మాత్రం..స్థానికులకు దక్కిందేమీ లేదు అనే భావనకలిగేలా ప్రతి జిల్లా ప్రజలను ఎలామభ్యపెట్టవచ్చో రామోజీరావు గారు తెలియ చేసారు..

ఆ నాటి ప్రతి జిల్లా వార్తలు చూడండి…ఇక్కడ క్లిక్ చెయ్యండి...

 

ఇంకా చదవండి »

కొన్ని అచ్చతెనుగు పదాలు – తేనెకన్నా తీయనైన భాషను మృతభాషగా మార్చకండి…

 శ్రీ ముసునూరి వేంకటశాస్త్రి గారిచే రచింపబడిన ‘ ఆంధ్రనామ సర్వస్వము ‘  పూర్వభాగము నుండి గ్రహింపబడినవి.

 అ

1.అంచగరులపానుపు  =    హంస యీకలతో చేయబడిన పానుపు

2.అలరుపాయము       =    చిన్నతనము , బాల్యము

1.ఆడినెల                   =     ఆషాఢమాసము

2.ఆనుపానులు           =     పుట్టుపూర్వోత్తరాలు

 3.ఆవలిమొన్న          =     మొన్నటికి పూర్వదినము

 4.ఆవలినాడు             =     ఎల్లుండికి పరదినము,ఆవలియెల్లుండి

ఇతరములు

 1.కోటేరు                    =    తలక్రిందుగా పట్టుకున్న నాగలి

2.చక్కెరముద్దుగుమ్మ =     అందకత్తె

3.చడిజాడలు              =     దారితెన్నులు , ఆనవాళ్ళు
 

మరికొన్ని అచ్చతెనుగు పదాలు త్వరలో…