పెద్దజీయర్ స్వామికి 60 లక్షలు..చిన్న స్వామివారికి 40 లక్షలు..

  • ఇప్పుడే టి.వి.9 లో ఫ్లాష్..
  •     “పెద్దజీయర్ స్వామి వారికి 60 లక్షలు..చిన్నజీయర్ స్వామికి 40 లక్షలు ఏటా గౌరవవేతనంగా ఇస్తామని టి.టి.డి. ప్రకటన..

అలరిస్తున్న ‘గోరింటాకు-2008′ పాటలు..

అలరిస్తున్న ‘గోరింటాకు-2008′ పాటలు..

సుద్దాల అశోక్ తేజ సాహిత్యంలో ‘చిత్ర ’ పాడిన..   ‘ఎడారిలో కోయిల’ పాట మీకు తప్పక నచ్చుతుంది.

ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి…

http://www.chitramala.com/audio-songs/gorintaku-1029.html

‘సాక్షి’ – ఈసారి ‘హెరిటేజి’ లెక్కల్లో ఈకు..

50 కిలోలు 80 రూపాయలకు కొన్నారట.. కిలో 9 రూపాయలకు అమ్మారట… పదిరెట్లట.. 

అయ్యా సాక్షి సారూ…ముందు కాలిక్యులేటర్ కొంటే బాగుండేది కదా…

Clicky Web Analytics

Clicky

‘సాక్షి’ – నాలుగు కోట్ల ఏళ్ళట .. మరో ఏడు తరాలట ..

 

గ్రహతాకిడితో భూమిపై జీవ వినాశనం

 

   రోజు ’సాక్షి‘ వార్త.. * నాలుగు కోట్ల ఏళ్ల తర్వాత బుధగ్రహం లేదా అంగారకుడు భూమిని 

 ఢీకొంటే మహావినాశనం తప్పదు.

 మనం మన తర్వాత మరో ఏడు తరాలకు ఇబ్బంది లేదన్నది వార్త… 

  తరానికి 25 ఏళ్ల వంతున వేసుకున్నా మన తర్వాత 16 లక్షల తరాల వరకు ఇబ్బంది వుండదు.

 

 

త్వరలోనే ’సాక్షి’ బాలారిష్టాలను అధిగమిస్తుందని ఆశిద్దాం.. ఆశించటంలో తప్పు లేదు కదా

 

                                    - వేంకట సత్యనారాయణ

రామోజీరావు గారూ..ఇదేనా మీ నిశ్’పాక్షికత ‘…

అనుకోకుండా ఒక రోజు ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది.ఆ రోజు వుదయాన్నే ఎప్పటినుండో చదవటానికి అలవాటుపడ్డ ఈనాడు దినపత్రిక చేతుల్లోకి తీసుకుని చూస్తే..జిల్లాకు మిగిలింది చిల్లరేఅనే టైటిల్ తో వార్త కనిపించింది.ప్రధాన పేజిలో ఎ’లక్ష’న్ బడ్జెట్ అనే శీర్షికను పెట్టి,,ప్రతి జిల్లావార్తలలో మాత్రం..స్థానికులకు దక్కిందేమీ లేదు అనే భావనకలిగేలా ప్రతి జిల్లా ప్రజలను ఎలామభ్యపెట్టవచ్చో రామోజీరావు గారు తెలియ చేసారు..

ఆ నాటి ప్రతి జిల్లా వార్తలు చూడండి…ఇక్కడ క్లిక్ చెయ్యండి...

 

ఇంకా చదవండి »

కొన్ని అచ్చతెనుగు పదాలు – తేనెకన్నా తీయనైన భాషను మృతభాషగా మార్చకండి…

 శ్రీ ముసునూరి వేంకటశాస్త్రి గారిచే రచింపబడిన ‘ ఆంధ్రనామ సర్వస్వము ‘  పూర్వభాగము నుండి గ్రహింపబడినవి.

 అ

1.అంచగరులపానుపు  =    హంస యీకలతో చేయబడిన పానుపు

2.అలరుపాయము       =    చిన్నతనము , బాల్యము

1.ఆడినెల                   =     ఆషాఢమాసము

2.ఆనుపానులు           =     పుట్టుపూర్వోత్తరాలు

 3.ఆవలిమొన్న          =     మొన్నటికి పూర్వదినము

 4.ఆవలినాడు             =     ఎల్లుండికి పరదినము,ఆవలియెల్లుండి

ఇతరములు

 1.కోటేరు                    =    తలక్రిందుగా పట్టుకున్న నాగలి

2.చక్కెరముద్దుగుమ్మ =     అందకత్తె

3.చడిజాడలు              =     దారితెన్నులు , ఆనవాళ్ళు
 

మరికొన్ని అచ్చతెనుగు పదాలు త్వరలో…


« వెనుకటి పుటము